: అమెరికాలో కలెక్షన్ల 'బలుపు'
రవితేజ తాజా చిత్రం 'బలుపు' అమెరికాలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అమెరికాలో తొలిరోజే 51 లక్షలు వసూలు చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా ఒక్క శుక్రవారం నాడే రూ.3.90 కోట్లు రాబట్టిందట. రవితేజ కెరీర్లో ఇప్పటిదాకా మొదటి రోజు ఇంత కలెక్షన్ సాధించిన సినిమా మరోటి లేదు. కాగా, చాన్నాళ్ళ తర్వాత ఈ మాస్ మహారాజా భారీ ఓపెనింగ్స్ తో దూసుకెళ్ళడం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు.