: ఆంగ్ల భాషలో అన్నమయ్య కీర్తనలు
బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే... అంటూ కీర్తనలు అల్లి శ్రీవెంకటేశ్వరుడికి తేట తెలుగులో పూమాలలు కట్టిన పదకవితల తోటమాలి అన్నమయ్య గీతా ప్రాభవం ఇక ఆంగ్లంలోనూ అందుబాటులోకి రానుంది. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం అన్నమయ్య నోట జాలువారిన సుమధుర కీర్తనలను ప్రఖ్యాత రచయిత్రి అంబికా అనంత్ తాజాగా ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. అయితే, ఎంపిక చేసిన కొన్ని గీతాలను మాత్రమే ఆంగ్లీకరించారు. మార్చి 17న జరిగే తెలుగు విజ్ఞాన సమితి వజ్రోత్సవాల వేదికపై తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.