: మహిళలకు సగంవాటా అంటోన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మహిళలకు పార్టీలో పెద్దపీట వేసే క్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ కమిటీతోపాటు కాంగ్రెస్ పార్టీలోని పలు పదవులను 50 శాతం మహిళలకు కేటాయించాలని రాహుల్ తీర్మానించారు. వచ్చే ఎన్నికలకు గాను ఎంపిక చేసిన పార్టీ కార్యవర్గంతో ఆయన నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. మరో రెండు మూడేళ్ళలో పార్టీ కార్యవర్గాన్ని యాభై శాతం మహిళలతోనే నింపేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐసీసీకి 12 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, వారిలో అంబికా సోనీ ఒక్కరే మహిళ అని, ఇక 44 మంది కార్యదర్శుల్లో మహిళలు ఐదుగురే అని ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని రాహుల్ అన్నారు.