: మాకో లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వరూ: కన్నా
రాష్ట్రానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర వ్యవసాయశాఖా మంత్రిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీకాంత్ కుమార్ తో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవడంతో ఈ ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ భూమి మొత్తం సాగులోకి వచ్చే అవకాశముందని, అందుకే రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలంటే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. కన్నా అభ్యర్ధనపై శ్రీకాంత్ కుమార్ సానుకూలంగా స్పందించారని కన్నా తెలిపారు.