: రమాకాంత్ రెడ్డితో రాజకీయ నేతల భేటీ


రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డితో శనివారం వివిధ రాజకీయ పార్టీల నేతలు సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలకు ఆయన ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. రిజర్వేషన్లపై నేతల సందేహాలకు సమాధానాలిచ్చారు. మరో మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా సాగాలన్న దానిపై కూడా చర్చ సాగింది. అన్ని పార్టీలు ఈ ఎన్నిలకు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News