: శంకర్రావుకు హైబీపీ వచ్చింది!
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన నేడు హైబీపీతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. సీఎం కిరణ్ పైనా, డీజీపీ దినేశ్ రెడ్డిపైనా ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసిన ఆయనను అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించిన నేపథ్యంలో.. తీవ్ర అస్వస్థతకు గురికావడం గమనార్హం.