: కిడ్నాప్ సాక్షి బాలిక చేతిని నరికిన దుండగులు
కిడ్నాప్ కేసులో సాక్ష్యంగా నిలిచిన బాలిక చేతిని నరికిన ఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. కుదంకౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వివరాల ప్రకారం నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన సాక్షిగా నిలిచిన బాలిక అక్క రాజేంద్ర నగర్ టెర్మినల్ దగ్గర నడుస్తుండగా నిందితుడు కత్తితో నరికాడు. దీంతో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. తన చెల్లిని కిడ్నాప్ కు ప్రయత్నించిన వాడే తనను నరికాడని బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.