: ఉత్తరాఖండ్ మృతులు 10 వేలకు పైనే
ఉత్తరాఖండ్ మృతుల సంఖ్య 10 వేల మందికి పైగానే ఉంటుందని ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ తెలిపారు. శనివారం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, యాత్రీకుల తరలింపు, స్థానికులకు నిత్యావసరాల అందజేత వంటి సహయక చర్యలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. అయితే, మరోసారి వరదలు ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉత్తరాఖండ్ ను ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.