: తొలుత గాల్లోకెగిరింది రైట్ సోదరులు కాదా?
రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు అని మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పటివరకు రైట్ సోదరులే తొలుత గాల్లోకెగిరింది అని అందరూ అనుకుంటుంటే.. అమెరికాలోని కనెక్టికట్ న్యాయస్థానం మాత్రం అంతకుముందే మరోవ్యక్తి వాయుయానం చేశాడంటోంది. రైట్ సోదరులు విల్బర్ట్, ఆర్విల్ 1903 డిసెంబర్ లో తమ కిట్టీహాక్ విమానంలో నార్త్ కరోలినా వద్ద గాల్లో ప్రయాణించారని న్యూయార్క్ డైలీ న్యూస్ పత్రిక పాత ప్రతులు చెబుతున్నాయి.
అయితే, గుస్టావ్ వైట్ హెడ్ అనే జర్మన్ వలసదారుడు రైట్ సోదరులకంటే 2 సంవత్సరాల 4 నెలల 3 రోజుల ముందే విమానయానం చేశాడని డానియెల్ మల్లోయ్ అనే అమెరికన్ జాతీయుడు వెల్లడించాడు. అందుకు రుజువులుగా కొన్ని ఛాయాచిత్రాలను కోర్టులో సమర్పించడమేకాకుండా.. కొందరు సాక్ష్యులనూ హాజరుపరిచాడు. వీటికితోడు.. ఏవియేషన్ రంగంలో బైబిల్ గా భావించే పత్రిక 'జేన్స్ ఆల్ ద వరల్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్' లో ప్రచురితమైన కథనాన్ని కూడా ఉటంకించాడు. దీంతో, కనెక్టికట్ న్యాయస్థానం జర్మన్ జాతీయుడే రైట్ సోదరులకంటే ముందు గాల్లోకెగరాడని తేల్చింది.