: తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల ఢీ
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులో ఒక బస్సు, కారు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ఇటీవలి కాలంలో ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని నివారించడానికి సమయ పరిమితిని విధిస్తున్నామని పోలీసులు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలవుతున్నట్లు లేదు.