: ధోనీ సక్సెస్ మంత్ర.. డ్రెస్సింగ్ రూమ్
టీమిండియా విజయ రహస్యాన్ని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెస్టిండీస్ గడ్డపై చెప్పాడు. జట్టు విజయరహస్యానికి డ్రెస్సింగ్ రూమ్ కారణమని వివరించాడు. 'మేము ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. ఎక్కువ శాతం జట్టు విజయాలకు కారణమిదే. జట్టులో ఎవరైనా ఆటగాడు 50 లేదా 100 స్కోరు చేస్తే అతడి కంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. అలాంటి వాతావరణం ఉంటే జట్టు సానుకూలతతో ఆడుతుంది. జట్టులో ప్రతీ ఒక్కరూ తమవంతు సమయం కోసం వేచి చూస్తూ అది వచ్చినప్పుడు సత్తా చూపిస్తారు' అని ధోనీ తన సక్సెస్ మంత్రాన్ని మొదటిసారిగా వెల్లడించాడు.