: అనుమానాస్పద స్థితిలో ఎమ్మెల్సీ అభ్యర్థి మృతి
ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి ఆవలదాసు దుర్గాప్రసాద్ మృతి చెందారు. ఓ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం రేకెత్తిస్తోంది. ఎలా మరణించాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన పలు సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.