: భక్తులతో తిరుమల కిటకిట
తిరుమల నేడు భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. వెంకన్న సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, నడకదారిలో వచ్చే భక్తులకు 6 గంటలు పడుతోంది. ప్రస్తుతం 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు.