: బాలయ్య అమెరికా పర్యటన ప్రారంభం


నందమూరి బాలకృష్ణ పది రోజుల అమెరికా పర్యటన నిమిత్తం శుక్రవారం న్యూయార్క్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసాంధ్ర ప్రముఖులు స్వాగతం పలికారు. తన పర్యటనలో బాలయ్య పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. డెలావేర్ లో శనివారం జరగనున్న తెలుగు సంఘం 40వ వార్షికోత్సవాలకు ఆయన హాజరవుతారు. 30న కనెక్టికట్ లో బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం విరాళాలను సేకరిస్తారు. జూలై 4 నుంచి 6 వరకు డల్లాస్ లో జరిగే నాట్స్ వేడుకులకు బాలకృష్ణ హాజరవుతారు.

  • Loading...

More Telugu News