: 'సడక్ బంద్' విజయవంతం కావాలని టీఆర్ఎస్ బస్సుయాత్ర


తెలంగాణపై నిర్ణయాన్ని కేంద్రం గడువులోగా ప్రకటించకుండా విస్మరించినందుకు నిరసనగా, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చేపడుతున్న ‘సడక్ బంద్’ ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. ఇందుకోసం ఒకరోజు బస్సుయాత్రను చేపడుతున్నట్లు తెలిపింది.

బుధవారం ఉదయం 8 గంటలకు హైదరాబాదులోని
 పార్టీ కార్యాలయం టీఆర్ఎస్ భవన్ నుంచి యాత్ర మొదలవుతుందని వెల్లడించింది. ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ ఆలంపూర్ కూడలి వరకు కొనసాగే ఈ యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారు. 

  • Loading...

More Telugu News