: ఇక మరింత వేగవంతమైన ఇంటర్‌నెట్‌


ఇంటర్‌నెట్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పుడు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఒక కొత్త ఫైబర్ ఆప్టిక్‌ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీంతో ఇంటర్‌ నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ను గణనీయంగా పెంచవచ్చు.

బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో మనదేశానికి చెందిన ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ సిద్ధార్థ్‌ రామచంద్రన్‌ ఈ ఫైబర్ ఆప్టిక్‌ పరిజ్ఞానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విధానంలో సమాచారం కాంతి రూపంలో నేరుగా కేబుల్స్‌ గుండా ప్రసారం అవుతుంది. అయితే ఇప్పుడు కనుగొన్న ఈ సరికొత్త ఫైబర్ ఆప్టిక్‌ విధానంలో సమాచారం డోనట్‌ ఆకారంలో గుండ్రంగా ఉండే లేజర్‌ లైట్‌బీమ్‌ (వీటిని ఆప్టిక్‌ వర్టిసెస్‌ అంటారు)ల గుండా కాంతి టోర్నడో తరహాలో మెలికలు తిరుగుతూ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఈ కొత్త విధానంతో ఇంటర్నెట్‌ బాండ్‌ విడ్త్‌ గణనీయంగా పెరుగుతుందని రామచంద్రన్‌, ఆయన సహచరుడు యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన అలాన్‌ విల్నర్‌ జర్నల్‌ సైన్స్‌కు రాసిన పేపర్‌లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News