: గబ్బిలాల విషంతో వైద్యం
గబ్బిలాలను వైద్యంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు గబ్బిలంలో ఉండే విషంతో కూడా వైద్యం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అవి మామూలు గబ్బిలాలు కాదు... వాంపైర్స్... జంతువుల రక్తం తాగే గబ్బిలాలు.
ఇలాంటి గబ్బిలాల్లో ఉండే విషంతో రక్తపోటు వంటి సమస్యలకు విరుగుడు మందు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ ఫ్రే నేతృత్వంలోని ఒక పరిశోధక బృందం ఈ విషంపై పరిశోధనలు చేసింది. గబ్బిలం విషంలో రోగి శరీరంలోని వ్యాధి నిరోధకతపై ప్రభావం చూపే కణాలు ఉంటాయని ఈ బృందం తమ పరిశోధనలో కనుగొంది. జంతువులను మరింత సులువుగా వేటాడడానికిగాను గబ్బిలాల విషం తరచూ మార్పు చెందుతూ ఉంటుందని ఫ్రే తెలిపారు. ఈ విషయంపై పరిశోధనలు చేసినపుడు గబ్బిలాల విషంతో అధిక రక్తపోటు వంటి వ్యాధుల్లో ఉపయోగించే మందుల్లో ఉపయోగించవచ్చని తేలిందని ఫ్రే చెబుతున్నారు.