: పాతవాచీకి ఇంత క్రేజీనా!


అదో పాత వాచీ... అయినా ఆ వాచీకి చాలా క్రేజుంది. దీంతో ఆ వాచీని వేలం వేస్తే ఏకంగా 96 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఆ వాచీకి ఓ స్పెషాలిటీ ఉందిలెండి. ఎందుకంటే... ఆ వాచీని జేమ్స్‌బాండ్‌ సినిమాలో వాడారు కాబట్టి దానికి అంత ధర పలికింది.

'థండర్‌బాల్‌' అనే జేమ్స్‌బాండ్‌ సినిమాలో సీన్‌ కానరీ అనే నటుడు ఈ వాచీని ధరించారు. ఈ వాచీని 1962లో బ్రీట్లింగ్‌ అనే సంస్థ రూపొందించింది. దీన్ని ఒకతను పాత వస్తువుల కొనుగోలు కేంద్రంలో 25 పౌండ్లకు కొనుగోలు చేశారు. అలాంటి వాచీని లండన్‌లోని క్రిస్టీనా అనే సంస్థ వేలం వేయగా, సదరు వాచీ ఏకంగా రూ.96 లక్షలకు అమ్ముడుపోయి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

  • Loading...

More Telugu News