: రాణించిన జయవర్ధనే... నిలకడగా ఆడుతున్న శ్రీలంక... 138/3
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ఒపెనర్లుగా దిగిన తరంగ, జయవర్ధనే శుభారంభాన్ని ఇవ్వడంతో తొలి వికెట్ కు శ్రీలంక 62 పరుగులు జోడించింది. తరంగ అవుటైన తరువాత జయవర్ధనే హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. అనంతరం సంగక్కర కేవలం 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో మూడు వికెట్ల నష్టానికి శ్రీలంక 30 ఓవర్లలో 138 పరుగులు చేసింది. చండిమాల్ 20 పరుగులతో, కెప్టెన్ మాథ్యూస్ 21 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. వీండీస్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీసి రాణించాడు.