: దీపావళికి క్రిష్ 3, మార్కెట్లో సందడి చేస్తున్న ట్రైలర్


హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా జంటగా నటించిన క్రిష్, క్రిష్ 2 సినిమాలు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. మరోసారి అభిమానులను అలరించేందుకు ఈ సినిమా సీక్వల్ క్రిష్ 3 ముస్తాబవుతోంది. హైదరాబాద్ లో క్రిష్ 3 సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో హృతిక్ తో పాటు వివేక్ ఓబెరాయ్, కంగానా రనౌత్ ముఖ్యపాత్రలు పోషించారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News