: యువత స్వయం ఉపాధికి కొత్తపథకం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధికోసం కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు 500 మంది కార్యకర్తలు మెదక్ నుంచి వచ్చారు. వారిని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆ పథకం వివరాలు వెల్లడిస్తూ, కనీసం ఆరు లక్షల మందికి ఉపయోగపడేలా ఆ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఈ పథకం పటిష్టంగా అమలు చేసేందుకు షెడ్యూల్డు కులాల ఆర్ధిక సంస్ధను ఇటీవలే పునర్వ్యవస్థీకరించి నియామకాలు కూడా పూర్తి చేశామని తెలిపారు.