: అవినీతి డబ్బుతో రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి: సామాజిక వేత్తలు


ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అవినీతి డబ్బుతోనే నడుస్తోందని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడ్డారు. కార్పొరెట్ వర్గాలకు అనుగుణంగా వ్యవస్ధను నడిపించేందుకు రాజకీయ వర్గాలు కంకణం కట్టుకున్నాయని సామాజిక ఉద్యమ కారులు నిఖిల్ డే, రాజేంద్రసింగ్, సందీప్ పాండేలు పేర్కొన్నారు . హైదరాబాద్ లో ప్రజాఉద్యమాల జాతీయ వేదిక కార్యక్రమంలో పాల్గొన్న వీరు రాజకీయ వ్యవస్థలపై మాట్లాడే ముందు, సిద్దాంతం అమలుపై పూర్తిగా ప్రజల్లో అవగాహన, ఆలోచన వచ్చే విధంగా చూడాలని అభిప్రాయపడ్డారు.

రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా విధానాల రూపకల్పనలో తలమునకలైపోయాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు విస్తృత స్థాయిలో ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని వీరంతా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News