: సచిన్ సేవలను వినియోగించుకోలేకపోతున్న మహారాష్ట్ర
సామాజిక చైతన్యం రగిలించడంలో సచిన్ ను మించిన వ్యక్తి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, సామాజిక న్యాయం, డ్రగ్ అడిక్షన్ అంశాలపై ప్రచారానికి ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సేవలు వినియోగించుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సచిన్ ఆ బాధ్యత స్వీకరించడానికి సిద్దంగానే ఉన్నాడు కానీ, అందుకు ప్రభుత్వ సంస్థలు ఏవీ ఆయనను సంప్రదించలేదు, దీంతో ఏఏ ప్రభుత్వ సంస్థలు దీనికి బాధ్యత వహిస్తున్నాయో వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. యుద్ధ ప్రాతిపదికన సామాజిక న్యాయం, డీ అడిక్షన్ అంశాలపై ప్రచారాధికారిణిగా మహిళల విభాగంలో ప్రముఖ సంఘ సేవకురాలు సింధూతాయి సప్కాల్ ను నియమించారు.