: కావూరిది సమైక్యవాదమే: శైలజానాథ్
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుది సమైక్యవాదమేనని శైలజానాథ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం దేనికైనా తాము సిద్ధమేనని శైలజానాథ్ తెలిపారు. 'మంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో అలాగే కావూరి మాట్లాడారు. వాస్తవానికి ఆయన సమైక్యవాదే. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మేం దిగ్విజయ్ సింగ్ ను కోరుతాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నాం' అంటూ తెలిపారు శైలజానాథ్.