మంత్రి జానారెడ్డి అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ వీవీ రావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో నేడు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జానా ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ రావు తన పిటిషన్ లో పేర్కొన్నారు.