: సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేల సమావేశం


తెలంగాణ ప్రకటన త్వరలోనే విడుదలవుతుందంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా హైదరాబాద్ లోని మినిష్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, గాదె వెంకట్ రెడ్డి, మస్తాన్ వలీ, పాలడుగు వెంకట్రావు, రుద్రరాజు పద్మరాజు, రామారావు వంటి నేతలు హాజరయ్యారు. వీరంతా ప్రధానంగా కాంగ్రెస్ అధిష్ఠానం పయనమెటువైపు, తెలంగాణ ప్రకటిస్తే పరిస్ధితేంటి, రాయల తెలంగాణ ఊహాగానాలు ఎటువేపునుంచి వస్తున్నాయి, ప్యాకేజీలు, భవిష్యత్ ప్రణాళిక వంటి అంశాలపై చర్చిస్తున్నారు. గతంలో సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకున్న నేతలంతా చల్లగా జారుకుంటుండడంపై కూడా వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News