: కీలక బుకీ అరెస్టు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో కీలకంగా భావిస్తున్న ఓ బుకీని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన జితేంద్ర సింగ్ అలియాస్ జీతును ఈ రోజు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక గూడచారి జట్టు జీతూను అరెస్టు చేసింది. ఈ కేసులో క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా అరెస్టయిన సంగతి తెలిసందే.