: వెనుదిరిగిన 'అమ్మ' హెలికాప్టర్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేడు అననుకూల వాతావరణం కారణంగా కోయంబత్తూరుకు తిరిగొచ్చింది. జయ ఈ ఉదయం హిల్ స్టేషన్ కోదనాడు పయనం కాగా.. అక్కడ భారీగా పొగమంచు ఆవరించి ఉండడంతో ఆమె ప్రయాణిస్తున్న చాపర్ వెనుదిరిగి కోయంబత్తూరు విమానాశ్రయంలో ల్యాండయింది. అనంతరం జయలలిత రోడ్డు మార్గం ద్వారా కోదనాడు వెళ్ళారు. ఇందుకు దాదాపు మూడుగంటల సమయం పట్టింది. జయ కొన్ని వారాల పాటు కోదనాడులోనే బస చేస్తారని, పాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే చక్కబెడతారని అధికార వర్గాలు తెలిపాయి.