: ఉత్తరాఖండ్ పై మనసు విప్పిన బాబు
చార్ ధామ్ యాత్రీకులను రాష్ట్రానికి చేర్చిన అనంతరం బాబు మనసువిప్పి మాట్లాడారు. ఢిల్లీలో బాధితులను ఏపీ భవన్ ఎదుట టెంట్ వేసి వుంచడం తనను బాధించిందని పేర్కొన్నారు. ఆంధ్రులకోసం కట్టిందే ఏపీ భవన్ అనీ, చావును తప్పించుకుని వేదనతో ఉన్నవారిని అక్కున చేర్చుకోవాల్సిన ఏపీభవన్ బయట టెంట్ వేసి ఉంచడంతో బాధేసిందన్నారు. అందుకే ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. బాధితులను కలిసిన తరువాత చేతనైనంత సాయం చేయాలని సంకల్పించానే తప్ప గొప్పకోసం చేయలేదని తెలిపారు. ఉత్తరాఖండ్ బాధితులు ఎవర్ని కదిపినా ఒక్కో ఘటన వెలికి వచ్చేదన్న బాబు, జరిగిన దారుణం తనను కలచి వేసిందన్నారు. అందుకే ఉత్తరాఖండ్ సీఎం విజయా బహుగుణతో మాట్లాడి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశానన్నారు. అన్ని రాష్ట్రాలు తమ యాత్రీకులను రక్షించేందుకు బృందాలు ఏర్పాటు చేసి పంపితే. మన రాష్ట్ర నేతలు చివర్లో వచ్చి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.