: మోహన్ బాబుకు హైకోర్టు అక్షింతలు
మోహన్ బాబు నిర్మించిన 'దేనికైనా రెడీ' సినిమాలో రెండు అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటీషన్ పై తీర్పునిచ్చిన హైకోర్టు, సినిమాలోని మొత్తం కధాంశాన్ని చూడాలి తప్ప ఒకట్రెండు సన్నివేశాలను కాదని పిటీషనర్ కు సూచించింది. ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ ధియేటర్లు, ఇళ్లపై దాడులు సరికాదని మందలించింది. సినిమా అలరించే విధంగా ఉండాలే కానీ కించపరిచేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాత మోహన్ బాబుకు సూచించింది.