: ప్రజలపై పెట్రో భారం తప్పదు: మొయిలీ
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. దేశంలోని చమురు అవసరాల కోసం దాదాపు 75 శాతం పెట్రోల్ ను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని..ఇందుకోసం దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మొయిలీ తెలిపారు.
ప్రజలపై పన్ను వేయకుండా ఇంత పెద్ద మొత్తం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులపై ఒకేసారి భారం పడకుండా కొద్దికొద్దిగా ధర పెంచుతున్నామని మొయిలీ తెలిపారు.
ప్రజలపై పన్ను వేయకుండా ఇంత పెద్ద మొత్తం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులపై ఒకేసారి భారం పడకుండా కొద్దికొద్దిగా ధర పెంచుతున్నామని మొయిలీ తెలిపారు.