: చేనేత కళాకారులకు వడ్డీ లేని రుణం
చేనేత కళాకారులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీ హిల్స్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో జరిగిన రాష్ట్రస్థాయి చేనేత కళాకారుల సదస్సులో ముఖ్యమంత్రితోపాటు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. కావూరి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కష్టాలు తనకు తెలుసునని, సమాజంలో చేనేత కార్మికులు గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.