: తన 'హీరో'ను పరామర్శించనున్న ఒబామా
నల్ల సూరీడు నెల్సన్ మండేలాయే తనకు ఆదర్శమని పలువేదికలపై చెప్పే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేడు తన హీరోను పరామర్శించనున్నారు. సెనెగల్ పర్యటన పూర్తి చేసుకున్న ఒబామా నేడు దక్షిణాఫ్రికా పయనం కానున్నారు. సెనెగల్ లో నిన్న మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మండేలా లోకనాయకుడని అభివర్ణిస్తూ, ఆయన ప్రాభవం తరతరాలు విరాజిల్లుతుందని పేర్కొన్నారు. కాగా, నెల్సన్ మండేలా తీవ్ర శ్వాసకోశ వ్యాధితో కొద్ది వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఉద్యమకారుడు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారు.