: సమైక్యాంధ్ర రథయాత్ర
సీమాంధ్ర వ్యాప్తంగా వచ్చే నెల 15 నుంచి రథయాత్ర చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. మంత్రి ఎక్కడ కనిపించినా నిరసన తెలియజేయాలంటూ పిలుపునిచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రోజు సమావేశమైన సమైక్యాంధ్ర జేఏసీ ఈ నిర్ణయాలు తీసుకుంది.