: విజయమ్మకు తెలంగాణవాదుల సెగ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పల్ బస్ డిపో దగ్గర విజయమ్మను అడ్డుకున్న తెలంగాణవాదులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు అనుకూలంగా ఉండాలని ఆమెను డిమాండ్ చేశారు. దీంతో విజయమ్మ భద్రతా సిబ్బంది వెంటనే కలగజేసుకొని విజయమ్మను తరలించేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.