: ఈ హెలికాప్టర్ టైం బాగుంది!


ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించే క్రమంలో ఓ హెలికాప్టర్ నేడు తృటిలో ప్రమాదం తప్పించుకుంది. గాల్లోకెగసే క్రమంలో ఈ పవన్ హన్స్ హెలికాప్టర్ హార్సిల్ పట్టణంలో అత్యవసరంగా ల్యాండైంది. భారీ వర్షం కుదిపేయడంతో ఒక్కసారిగా భూమిని గుద్దుకుంటూ ల్యాండయింది.ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, మంగళవారం వాయుసేనకు చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ గౌరీకుండ్ వద్ద ఇరుకైన లోయలో కూలిపోగా.. 20 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News