: బాధితుల కోసం 'వందేమాతరం' గేయం
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం తనవంతుగా పాటతో చేయూతనందిస్తున్నారు. బాధితులను ఆదుకోవడం కోసం అందరి హృదయాలను కదిలించేలా 'కదలుదాం కదలుదాం' అంటూ స్వయంగా ఒక పాటను రూపొందించి టీవీ చానళ్లకు అందజేశారు. ఈ పాటను కరుణాకర్ రాశారు. బాధితులను ఆదుకోవడం కోసం గాయనీ గాయకులు సహా అందరూ ముందుకు రావాలని వందేమాతరం కోరారు.