: మయన్మార్ లో ఎయిర్ టెల్ కు చుక్కెదురు


మయన్మార్ టెలికాం లైసెన్సుల టెండర్లలో భారతి ఎయిర్ టెల్ సంస్థకు చుక్కెదురైంది. పొరుగుదేశంలోనూ పాగా వేయాలని భావించిన ఎయిర్ టెల్ కు టెలెనార్, ఓరెడో కంపెనీలు చెక్ పెట్టాయి. లైసెన్సుల బిడ్డింగ్ ప్రక్రియలో నార్వే టెలికాం దిగ్గజం టెలెనార్ తో పాటు, ఖతార్ టెలికాం సంస్థ ఓరెడో ఎంపికయ్యాయని మయన్మార్ ప్రభుత్వ కమిటీ ప్రకటించింది. దీంతో, ఎయిర్ టెల్ తో పాటు మరో 9 కంపెనీలకు నిరాశ తప్పలేదు. వాటిలో వొడాఫోన్, సింగ్ టెల్, టెలికాం-ఆరెంజ్ వంటి విఖ్యాత కమ్యూనికేషన్ సంస్థలున్నాయి.

కాగా, మయన్మార్ టెలికాం రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ఇదే ప్రథమం. ఇక్కడి ప్రభుత్వం 2015-16కల్లా దేశంలో టెలికాం సేవలను 80 శాతానికి విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెలెనార్, ఓరెడో కంపెనీలు మయన్మార్ లో సేవలు అందించే తొలి ప్రైవేటు సంస్థలవుతాయి.

  • Loading...

More Telugu News