: భారత్-ఆసీస్ తొలి టెస్టు టిక్కెట్లకు ఎగబడ్డ అభిమానులు
టెస్ట్ క్రికెట్ అంటే బోర్ అనుకోవడం పాత మాట..టెస్టుల్లోనే ఉంది అసలు మజా అంటున్నారు నేటి క్రికెట్ అభిమానులు. చెన్నైలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలు కానున్న తొలి టెస్టును వీక్షించేందుకు అభిమానులు టిక్కెట్ల కోసం క్యూ కట్టారు. స్పిన్ కు అనుకూలించే చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 22న జరగనున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమంటున్నారు అభిమానులు.