: ఇక అల్జీమర్స్‌ను మరిచిపోవచ్చు


అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులకు ఒక శుభవార్త. శాస్త్రవేత్తలు కొత్తగా తయారు చేసిన ఒక మందు అల్జీమర్స్‌ వ్యాధిని దరిచేరకుండా వారి మెదడుకు రక్షణనిస్తుందట. ఈ వ్యాధి వచ్చిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే తాము తయారు చేసిన మందు రోగుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కెంటకీ విశ్వవిద్యాలయంలోని శాండస్‌-బ్రౌన్‌ వృద్ధాప్య పరిశోధన కేంద్రం సంచాలకుడు లిండా వాన్‌ ఎల్డిక్‌ మాట్లాడుతూ వ్యాధి ప్రారంభదశలోనే ఈ మందును వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. నిజానికి మన నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేయడం వల్ల మన మెదడు పనితీరు సమర్ధవంతంగా ఉంటుంది. దీని ఫలితంగా మనం అన్నీ గుర్తుంచుకోగలుగుతాం.

అయితే అల్జీమర్స్‌ వ్యాధి వచ్చిన వారిలో మాత్రం ఒక ప్రత్యేక ఎంజైము చురుగ్గా పనిచేస్తుంది. ఈ ఎంజైము నాడీ కణాలను బలహీనపరిచి మొత్తం నాడీ వ్యవస్థనే దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగులకు ఏ విషయం కూడా గుర్తుండదు. అయితే, అల్జీమర్స్‌ వ్యాధి ప్రారంభమైన తర్వాత అది తీవ్రస్థాయికి చేరడానికి పది నుండి పదిహేనేళ్లు పడుతుంది. ఈ సమయంలో శాస్త్రవేత్తలు కనుగొన్న ఎండబ్లూ108 అనే పేరుగల ఈ కొత్త మందు నాడీవ్యవస్థలో ప్రత్యేకంగా పనిచేసే ఎంజైమును అడ్డుకుంటుంది. నాడీకణాలకు రక్షణ కల్పిస్తుంది. తద్వారా రోగుల్లో జ్జాపకశక్తిని పదిలపరచవచ్చు

  • Loading...

More Telugu News