: వీరప్పన్ అనుచరులకు ప్రాణభిక్ష పెట్టండి: ప్రధానికి ఏసీహెచ్ ఆర్ విజ్ఞప్తి
భారతదేశంలో తాజాగా అమలవుతున్న ఉరిశిక్షల అమలుపై ఆసియా మానవహక్కుల సంఘం (ఏసీహెచ్ ఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. మందుపాతర పెట్టి 22మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో వీరప్పన్ నలుగురు అనుచరులకు విధించిన మరణదండన రద్దు చేసి, క్షమాభిక్ష ప్రసాదించాలని ఏసీహెచ్ ఆర్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరింది.
దేశంలో 2001-11 మధ్య కాలంలో మొత్తం 1,455 మంది నిందితులకు కోర్టులు ఉరిశిక్షని విధించాయి. మరణశిక్షల అమలులో భారత్ ప్రస్తుత వేగం చూస్తుంటే మరణశిక్షల అమలులో చైనా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ల తర్వాత స్థానంలో నిలవనుందని ఎసిహెచ్ ఆర్ హెచ్చరించింది. దీంతో ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన దేశాల జాబితాలో ఐదో స్థానంలో నిలవనుందని ఏసిహెచ్ ఆర్ తెలిపింది.