: డీజిల్, పెట్రోల్లానే గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయట
ప్రతి మూడు నెలలకు ఓసారి గ్యాస్ ధరలను సవరించనున్నట్టు ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో పెట్రోలు, డిజిల్ ధరలు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నట్టుగా, గ్యాస్ ధరవరలు కూడా సమీక్షించనున్నారు. రంగరాజన్ ఫార్ములా ఆధారంగా ఐదేళ్ల పాటు గ్యాస్ ధరల పెంపుకు కమిటీ ఆమోదం తెలిపింది. 2014 ఏప్రిల్ నుంచి గ్యాస్ ధరలు పెరగనున్నట్టు కమిటీ పేర్కొంది. మరో వైపు సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దాంతో పాటు కరెంటు ఛార్జీలు పెంచేందుకు కూడా కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో మరికొద్ది రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.