: నేనేమీ సింగర్నని ఫీలవ్వడం లేదు: ఫరాన్ అఖ్తర్
బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫరాన్ అఖ్తర్ తానేమీ సింగర్ కాదని అన్నాడు. అతని కొత్త సినిమా 'భాగ్ మిల్కా భాగ్' సినిమా ప్రమోషన్ సందర్శంగా తాజా సినిమాలో పాట పాడారా? అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఆ పాట సినిమాకు ఉపయోగ పడుతుందంటే పాడతానే తప్ప తాను ప్రోఫెషనల్ సింగర్ ను అనుకోవడం లేదని అన్నారు. 'ఏదో... అప్పుడు అలా కుదిరి పాడేశాను, అంతే' అన్నాడు.
ఫరాన్ బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్ కుమారుడన్న విషయం తెలిసిందే. 2008 లో విమర్శకుల ప్రశంసలందుకున్న 'రాక్ ఆన్' సినిమాలోని 5 పాటల్ని పాడి అభిమానులను అలరించాడు. అలాగే 2011లో వచ్చిన 'జిందగీ నా మిలేంగే దుబారా' సినిమాలో కూడా రెండు పాటలు పాడి అదరగొట్టాడు. మరి కొద్ది రోజులల్లో 'భాగ్ మిల్కా భాగ్' సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది.