: ఒక యజ్ఞం ముగిసింది, మరో ప్రస్థానం దిశగా పయనం సాగిద్దాం


వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ వరద బాధిత యాత్రీకుల తరలింపు చివరి దశకు చేరుకుంటోంది. శనివారం నాటికి యాత్రీకుల సహాయక చర్యలు ముగిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా వాతావరణం సహకరించక వాయిదాపడ్డ అంత్యక్రియలు నేడు కేదార్ నాథ్ లో శరవేగంగా జరిగాయి. ఇప్పటివరకూ వరద బాధిత యాత్రీకులపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయిన మారుమూల గ్రామాలకు కనీసం రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను తరలించడానికి సమాయత్తమవుతోంది.

రహదారులన్నీ కొట్టుకుపోవడంతో గత పది రోజులుగా వారికి నిత్యావసర వస్తువులు, విద్యుత్ వంటివేవీ అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్ధాల కొరత స్థానికులను తీవ్రంగా వేధిస్తోందని, యాత్రీకుల చర్యల్లో లీనమవ్వడంతో స్థానికులు నిర్లక్ష్యానికి గురయ్యారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరదల్లో భారీగా యాత్రీకులు మృతి చెందడంతో వరద ప్రాంతాల్లో శవాలు చిక్కుకుపోయి కుళ్లిపోయి అంటు వ్యాధులు ప్రబలే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది. పర్యాటక ప్రాంతాల్లో పునరావాసం, మౌలిక వసతుల కల్పనకు సిద్దమవుతోంది. ఓ యజ్ఞం ముగుస్తోందని, ఇక మరోప్రస్థానం దిశగా వరద బాధిత ప్రాంతం కదలాల్సిన అవసరముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News