: సైనా నెహ్వాల్ @ 3
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో ఓ స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (ఐబీఎఫ్) నేడు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో సైనాతో పాటు మరో ఇద్దరు భారత షట్లర్లు టాప్-50లో చోటు సంపాదించారు. తెలుగమ్మాయి పీవీ సింధు 12వ ర్యాంకును పదిలపరుచుకోగా, నాగ్ పూర్ క్రీడాకారిణి అరుంధతి పంట్వానే 10 స్థానాలు ఎగబాకి 49వ ర్యాంకుకు చేరుకుంది. ఇక పురుషుల్లో రాష్ట్రానికి చెందిన పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు దిగజారి 13వ ర్యాంకు వద్ద నిలిచాడు.