: రాజకీయనాయకులకు ఆదర్శం జగ్గారెడ్డి
ఉత్తరాఖండ్ బాధితులకు అండగా నిలబడాలంటూ రాజకీయ నాయకులంతా ప్రకటనలకు పరిమితమైపోయారు ఒక్క జగ్గారెడ్డి తప్ప. సొనియా ఎంపీలకు ఎమ్మెల్యేలకు సూచిస్తే ఒక రోజు వేతనాన్ని తమ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలను కేటాయించి చేతులు దులుపుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మాత్రం జరిగిన దారుణాన్ని చూసి కదిలిపోయారు. దీంతో 25 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. ఈ మెత్తాన్ని ముఖ్యమంత్రి ద్వారా ప్రధాన మంత్రి సహాయ నిధికి అందజేస్తామని తెలిపారు. సూటిగా, ధాటిగా విమర్శలు చేసే జగ్గారెడ్డి మనసున్న మనిషని నిరూపించుకున్నారని, ఆయన రాజకీయనాయకులందరికీ ఆదర్శనీయుడని కితాబునిస్తున్నారు ఆయన నియోజకవర్గ ప్రజలు.