: రాజస్థాన్ బీజేపీ సీఎం అభ్యర్థిగా వసుంధరా రాజే
త్వరలో జరగనున్న రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజే పేరును భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. రాజస్థాన్ ఎన్నికలలో వసుంధరా రాజే ముందుండి పార్టీని నడిపిస్తారని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా కూడా ఆమె పేరును ఆయన ఈ రోజు ప్రకటించారు.
శుక్రవారమే సీఎం అభ్యర్ధిత్వంపై చర్చించిన బీజేపీ అధినే