: 'రామయ్యా వస్తావయ్యా' రిలీజ్ డేట్ ఫిక్సైంది!


జూనియర్ ఎన్టీఆర్ తాజా ప్రాజెక్టు 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. హిట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తమన్ అందించిన స్వరాలు సరికొత్తగా ఉన్నాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా పోరాట సన్నివేశాలను హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని రాజు చెప్పారు.

  • Loading...

More Telugu News