: కేరళ హౌస్ బోట్లలో ఓపెన్ వ్యభిచారం
కేరళ.. గాడ్స్ ఓన్ కంట్రీ. అరేబియా సముద్రతీరంలో కొలువుదీరిన ఈ సుందర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రకృతిరమణీయత కనువిందు చేస్తుంది. ఆహ్లాదం కలిగించే పూలవనాలు, రోడ్లకిరువైపులా దర్శనమిచ్చే సుగంధ ద్రవ్యాల తోటలు, కుమరకోం, కుట్టనాడ్ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే బ్యాక్ వాటర్స్ అందాలు కేరళ సొంతం. ఇన్ని ఆకర్షణీయ స్థలాలు ఉండడంతో కేరళ సహజంగానే పర్యాటకుల జాబితాలో చోటు చేసుకుంటుంది.
ఈ సుమనోహర రాష్ట్రంలో పర్యటించిన వారు అక్కడి బ్యాక్ వాటర్స్ లో కొలువుదీరిన హౌస్ బోట్లలో కనీసం ఒక్కరోజైనా బస చేయాలని భావిస్తారు. ఆ బోట్లలో కల్పించే సౌకర్యాలు అలాంటివి. పట్టు పాన్పులు, సన్ బాత్ లు, నోరూరించే సీ ఫుడ్, కేరళ మార్కు కొబ్బరి కల్లు అన్నీ వాటిలో లభ్యమవుతాయి. అయితే, ఇటీవల ఈ హౌస్ బోట్లు కొన్ని పెడత్రోవ పట్టాయి. వాటిలో వ్యభిచారం నిర్వహిస్తూ యాజమాన్యాలు కాసులు దండుకుంటున్నాయి. వీరికి ముగ్గురు మహిళలు ఇతోధికంగా తోడ్పడతున్నారట.
ఈ త్రయం పాతికేళ్ళలోపు పడుచులనే కాదు ముక్కుపచ్చలారని పసిమొగ్గలనూ ఈ ఊబిలోకి దింపుతూ రసిక జనోద్ధరణకు సాయం చేస్తోందని ఓ వార్తా పత్రిక తెలిపింది. ఆ ముగ్గురి పేర్లు జీనత్, షెహానా, జెస్సీ అట. వీరి పనల్లా అందమైన అమ్మాయిలను వ్యభిచార ఊబిలో దింపడమే. ఇందుకోసం కొందరు అబ్బాయిలను పురమాయిస్తారని.. వారి పనల్లా చక్కని చుక్కల్లాంటి అమ్మాయిలకు ప్రేమ వల వేసి ఆనక ఈ ముగ్గురు పడుపు రాణులకు అప్పగించడమే. ఇక, ఇక్కడ సాగే రతి క్రీడల కోసం గల్ఫ్ దేశాలనుంచి అరబ్ షేకులు వస్తుంటారట.
కాగా, ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి రేటు ఎక్కువ పలుకుతుంది. వ్యభిచారానికి హౌస్ బోట్ అయితే పోలీసుల బెడద ఉండదని షేకులు భావించడం.. పడవ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొత్తం 1860 మంది అమ్మాయిలు ఈ రొంపిలో ఉన్నట్టు గుర్తించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పట్ల కేరళ స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారితీరు మారకపోతే ఉద్యమిస్తామని ఆ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.