: అమీర్ ఖాన్ భార్య ఎదురు చూపులు


అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు అతని తాజా సినిమా 'ధూమ్ 3' రీలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ 'ధూమ్ 3'లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, గత కొన్నేళ్లలో తానెప్పుడూ ఇంతలా ఎదురు చూడలేదన్న కిరణ్ రావు, జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్ పోషించిన పాత్రను అమీర్ చేయండం ఆసక్తి రేపుతోందని చెప్పారు. ఈ సినిమాలో అమీర్ ఎలాంటి నటనను ప్రదర్శించాడోనన్న ఆసక్తి తనను నిలువనీయడం లేదని, అందుకే ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా? అని ఎదురుచూస్తున్నాననీ అన్నారు. కాగా, అమీర్ ఖాన్ 'పీకే' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News